WhatsApp Image 2024 10 11 at 9.54.09 PM
దసరా సంబరాల ఏర్పాట్లను పరిశీలించిన రామగుండం శాసనసభ్యులు *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్
కార్పొరేషన్, స్థానిక పరిశ్రమల సహకారంతో దసరా వేడుకలు…
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని విజయదశమి పర్వదినం పురస్కరించుకుని శనివారం సాయంత్రం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో జరిగే వేడుకలను ఏర్పాట్లను రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పరిశీలించారు. సింగరేణి స్టేడియంలో అద్భుతంగా నిర్వహించే వేడుకలను సింగరేణి కార్మిక కుటుంబాలు, అన్ని వర్గాల ప్రజలు వీక్షించి వీక్షించాలని కోరారు. కార్పొరేషన్ తో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో వేడుకలు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మరింత ఆర్భాటంగా చేస్తామన్నారు.
ఇందుకు సంబంధించి సింగరేణి వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ అనంతరం శనివారం జరిగే దసరా వేడుకలను ప్రజలు సంతోషాల మధ్య జరుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా చేయాలని దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కార్పొరేషన్ నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, సింగరేణి సంస్థ జిఎం లలిత్ కుమార్ తో పాటు స్థానిక పరిశ్రమల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
