TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా జనగామ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రుద్రాభిషేకంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత” అని పేర్కొన్నారు అంతేగాక, నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ప్రతి ఒక్కరి సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దతామని అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA performs Rudrabhishekam