
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని బస్టాండ్ ఎదుట అజాతశత్రువు, అందరివాడు, మంథని ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభాపతి స్వర్గీయ దుద్దిల్ల పాద రావు వర్ధంతి సందర్భంగా, ఆయన స్మృతిని స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు ఎమ్మెల్యే ఏం.ఎస్. రాజ్ ఠాకూర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీపాద రావు రాష్ట్ర రాజకీయాలలో అపూర్వ ముద్ర వేసిన మహనీయుడు. ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాన్ని అంకితమిచ్చిన సుపరిచిత నాయకుడు. ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయి. మంథని, గోదావరిఖని ప్రజల హృదయాలలో ఆయన అమరుడై ఉన్నారు. ఇటువంటి మహనీయుని స్మరణ మనకు గొప్ప అని పేర్కొన్నారు వర్ధంతి కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని, మాలలు సమర్పించి, ఘన నివాళులు అర్పించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
