నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ
ర్యాలీ ప్రారంభించిన డాక్టర్ వి. విజయ లక్ష్మి డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ఓ
ఎయిడ్స్ వ్యాధి 5వ స్థానంలో తెలంగాణ
ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించండి… ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్సలు అందించండి
మాట్లాడటం వలన, కరచాలము చేయడం వలన, కలసి తిరగడం వలన, కౌగలించుకోవడం వలన మరియు కలసి భోజనం చేయడం వలన ఎయిడ్స్ వ్యాధి రాదు
Trinethram News : Telangana : ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా షాద్నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ, డాక్టర్ వి. విజయలక్ష్మి జెండాతో ర్యాలీని ప్రారంభించారు. షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఫరూక్నగర్ లోని గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు ఎయిడ్స్ డే కు సంబంధించిన స్లోగన్లు చెప్పుతూ, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ర్యాలీని ముందుకు తీసుకువెళ్లారు. ఈ ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఫరూక్ నగర్ లోనీ గాంధీ బొమ్మ వరకు నిర్వహించి తిరిగి షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. డిప్యూటీ డి ఎం ఎన్ హెచ్ ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం గురించి మాట్లాడుతూ ప్రజలందరూ ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండి, అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు . మన భారతదేశంలో మొదటి స్థానంలో మీజోరం, రెండవ స్థానంలో నాగాలాండ్, మూడవ స్థానంలో మణిపూర్, నాలుగవ స్థానము ఆంధ్రప్రదేశ్ మరియు ఐదవ స్థానంలో మన తెలంగాణ ఉంది అని తెలియజేశారు. అందువలన మన తెలంగాణలో వైద్య సిబ్బంది ఎయిడ్స్ వ్యాధిపై ఇంకా సంపూర్ణమైన అవగాహన ప్రజలకు కలిగించాలని ర్యాలీకి వచ్చిన ఏఎన్ఎం లకు మరియు ఆశలకు చెప్పారు. ఎయిడ్స్ వ్యాధి వచ్చినవాళ్లు సరైన చికిత్స తీసుకుంటే భయపడవలసిన అవసరం లేదు అని తెలియజేశారు.
తదుపరి హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి సురక్షితము లేని శృంగారం ద్వారా ( సంభోగము) వలన, కలుషితమైన రక్తము మరియు సూదుల వలన ఎయిడ్స్ వ్యాధి వస్తుందని తెలియజేశారు , ఎయిడ్స్ వ్యాధితో కూడిన స్త్రీ గర్భము ధరించినట్లయితే పుట్టబోయే బిడ్డకు కూడా తల్లి ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాపిస్తుందని చెప్పారు. కానీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారితో మాట్లాడటం వలన, కరచాలము చేయడం వలన, కలసి తిరగడం వలన, కౌగలించుకోవడం వలన మరియు కలసి భోజనం చేయడం వలన ఎయిడ్స్ వ్యాధి రాదు అని జే శ్రీనివాసులు తెలియజేశారు.. ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించే బాధ్యత మన అందరి పైన ఉంది అని ఏఎన్ఎం లకు ఆశాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి హెల్త్ ఎడ్యుకేటర్ జే.శ్రీనివాసులు, ఎమ్. ఎల్. హెచ్ పి వైద్య అధికారిని ప్రవీణ, హెల్త్ సూపర్వైజర్లు శ్రీరామ, చంద్రకళ, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్, హెల్త్ అసిస్టెంట్ రెడ్యానాయక్, మరియు రమేష్, రవికుమార్,మల్లేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము బూర్గుల మరియు చించోడు ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App