IMG 20240923 WA0018
The way of compromise is the right way. District SP Shri K. Narayana Reddy, IPS
Trinethram News : వికారాబాద్ జిల్లా
కేసుల రాజీ కుదుర్చుకునేందుకు 28.09.2024 రోజున జిల్లాలోని కోర్ట్ లలో న్యాయ శాఖ ఆద్వర్యం లో లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ గారు తెలిపినారు. కక్షిదారులు ఎవరైనా తమ కేసుల రాజీ కొరకు వేచిచూస్తున్నట్లు అయితే 28.09.2024 రోజున న్యాయ వ్యవస్థ లోక్ అదాలత్ ద్వారా కల్గించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 28 తేదీన జిల్లాలోని అన్నీ కోర్ట్ లలో లోక్ అదాలత్ కార్యక్రమం ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థ అధికారుల ఆద్వర్యం లో కేసులు రాజీ చేయడం జరుగుతుంది.
పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నవారు రాజీ కావాలి అనుకుంటే తమ స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని జిల్లా ఎస్‌పి గారు ఈ సందర్బంగా సూచించారు. రాజీ మార్గమే రాజ మార్గమని, కేసులలో రాజీ అవ్వాలనుకున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇట్టి సందర్భంగా జిల్లా ఎస్‌పి గారు తెలిపినారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
