WhatsApp Image 2024 03 15 at 21.55.00
Trinethram News : Mar 15, 2024,
రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
భానుడి భగభగలకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వీటితో పాటు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా, చండీగఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచలప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో మార్చి 16 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది
