గ్రామీణ ప్రాంతాల పిల్లలు కూడా పెద్ద కలలు కనాలి – డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ (రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్)
లింగాపూర్: లింగాపూర్ మండలం గిరిజన కుటుంబానికి చెందిన రాథోడ్ మమత రమేష్ నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి, ప్రభుత్వ ఖమ్మం మెడికల్ కాలేజీలో ఉచిత సీటు పొందింది. ఈ విజయం మొత్తం లింగాపూర్ మండలానికి, గిరిజన సమాజానికి గర్వకారణంగా నిలిచిందని డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ అన్నారు. విద్యార్థిని రాథోడ్ మమత విజయాన్ని గుర్తించి, రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని సహకారంతో, స్థానిక సామాజిక సేవకుడు జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థిని కుటుంబ సభ్యులకు శనివారం ₹5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ — గ్రామీణ ప్రాంతాల పిల్లలు కూడా పెద్ద కలలు కనాలన్నారు. పట్టుదలతో కష్టపడితే ఏ గమ్యమూ దూరం కాదనీ, రాథోడ్ మమత లాంటి గిరిజన విద్యార్థులు సమాజానికి ప్రేరణగా నిలవాలన్నారు. రెహమాన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ప్రతిభను ప్రోత్సహిస్తూ, విద్యారంగానికి అండగా నిలుస్తుందన్నారు. మమత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తూ, రెహమాన్ ఫౌండేషన్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాధవ్ రవీందర్, రాథోడ్ సుభాష్, కుటుంబ సభ్యులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


