కార్మికులతో కలిసి ఎమ్మెల్యే కు వినతి పత్రం ఇచ్చిన ఏఐటియుసి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి కి చెత్త సేకరణ చేసే కార్మికుల ను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గా పరిగణించి వారికి చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ రామగుండం శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎ గౌస్ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు లో వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత ఇరవై సంవత్సరాలుగా ఇంటింటి కి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్న కార్మికులు ర్యాగ్ పిక్కర్లు గా విధులు నిర్వహిస్తున్నారని, దీని వల్ల వారు వేతనాలు నామ మాత్రంగా ఇవ్వడం వల్ల అవి సరిపోక ఆర్థికంగా నష్టపోతున్నారని, అదే విధంగా ఎలాంటి చట్ట బద్ధమైన సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు అనేక అవస్థలు పడుతున్నారన ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తో మరియు అధికారులతో మాట్లాడి ర్యాగ్ పిక్కర్లను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గా పరిగణించి వేతనాలు పెంచాలని, చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన ఎమ్మెల్యే ను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ర్యాగ్ పిక్కర్ కార్మికులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


