WhatsApp Image 2024 05 23 at 17.56.56
Propaganda that Pinnelli would surrender, police patrolled in Narasa Raopet
నరసరావుపేట: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు..
నరసరావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిన్న తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు..
ఎమ్మెల్యే కారును గుర్తించి గన్‌మెన్, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి గురువారం నరసరావుపేట కోర్టులో లొంగిపోవచ్చన్న అనుమానంతో అప్రమత్తమైనట్టు పోలీసులు తెలిపారు. కేవలం అనుమానం మాత్రమేనని ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
