Mon. Mar 9th, 2026

Private Travels Bus Fire : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. 39 ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద హైదరాబాద్‌ నుంచి గుంటూరు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. కంచికచర్ల మండలం కేసర టోల్‌గేట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుక భాగంలో పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

అనంతరం బస్సు ఇంజిన్ భాగం మంటల్లో కాలిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Private Travels Bus Fire

Related Post

You cannot copy content of this page