WhatsApp Image 2024 10 28 at 9.27.34 AM modified
విద్యుదాఘాతం తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
విద్యుదాఘాతం తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వైద్య వెంకటేశ్వర్లు (56)మృతి చెందిన ఘటన జి ఎం కాలనీ లో అదివారం జరిగింది.వన్ టౌన్ ఎస్ ఐ టి.శ్రీనివాస్ కథనం ప్రకారం విఠల్ నగర్ కు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పని చేసే వైద్య వెంకటేశ్వర్లు జి ఎం కాలనీ లో ని చిన్న వెళ్లి వెంకటేశ్వర్లు ఇంటికి మోటార్ రిపేర్ నిమిత్తం వెళ్లగా విద్యుత్ వైర్ పట్టుకోగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలగా ,స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.మృతినికి భార్య,కుమార్తె ఉండగా కుమారుడు వైద్య నరేష్ పిర్యాదు మేరకు సీఐ ఏ.ఇంద్రసేనారెడ్డిఆదేశాల మేరకు ఎస్ ఐ టి.శ్రీనివాస్ వైద్య వెంకటేశ్వర్లు మృతి పై 194 బి న్ ఎస్ ఎస్. ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
