Araku Rail Roko : ఏజెన్సీ టీచర్ పోస్టుల్లో ఆదివాసీలకే ప్రాధాన్యం ఇవ్వాలి – 19న అరకు రైల్ రోకో

TRINETHRAM NEWS

క్యాబినెట్ సమావేశంలో స్పెషల్ డీఎస్సీపై అనుకూల నిర్ణయం తీసుకోవాలి

అల్లూరిజిల్లా (అరకులోయ)త్రినేత్రం న్యూస్ మే 18: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, మే 19న అరకులో రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ పిలుపునిచ్చింది. మే 20న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై అనుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అరకువేలి గిరిజన ఉద్యోగుల భవనంలో జిల్లా కో కన్వీనర్ పొద్దు బాలదేవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ కుడుముల కాంతారావు, ముఖ్య సలహాదారులు కిల్లో సురేంద్ర మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలను స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేస్తామని ప్రకటించడం సాధన కమిటీ ఉద్యమ ఫలితమని వారు పేర్కొన్నారు.
2025 మెగా డీఎస్సీపై ఆందోళన
2025 మెగా డీఎస్సీ ప్రకటనలో ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులకు ప్రత్యేకంగా ఆదివాసులకే శాతం కేటాయించకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 శాతం రిజర్వేషన్ ప్రకారం కేవలం 980 టీచర్ పోస్టులే ఎస్టీ అభ్యర్థులకు దక్కనున్నాయి. కానీ, 5వ షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకు కేటాయించాల్సిన 3 వేల పోస్టులు స్థానిక అభ్యర్థులకు లభించకుండా పోతున్నాయని విమర్శించారు.
ఉత్తర్వులు జారీ చేయడంలో ఆలస్యం
అడ్వకేట్ జనరల్ లీగల్ ఒపినియన్ వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం టీచర్ పోస్టులను ఎస్టీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయకుండా ఆలస్యం చేయడాన్ని వారు తప్పుపట్టారు. మే 15 నాటికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైల్ రోకోను విజయవంతం చేయండి
ఈ నేపథ్యంలో మే 19న అరకులో చేపట్టనున్న రైల్ రోకోను ఆదివాసీ ప్రజానీకం, నిరుద్యోగులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని సాధన కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఎస్. ధర్మన్నపడాల్, పి. అప్పల నర్సయ్య, సమిరెడ్డి మాణిక్యం, చట్టు మోహన్, వంతలా నాగేశ్వరరావు, ఎం. రమేష్ కుమార్, పాంగి అశోక్ కుమార్, కిల్లో జగనాధం, గదుం బుజ్జిబాబు, సివేరి బాలకృష్ణ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దేముడు రాంబాబు, మల్లేష్ నాగేంద్ర,మాజీ కె. ఐసుబాబు,గుజ్జల సురేష్, కోర్ర ప్రసన్న, జానుబాబు, కిల్లో దాసు, సుశీల, కాంగు శుభ శర్మ, కాసులమ్మ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Priority should be given

You cannot copy content of this page

Scroll to Top