జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 05 at 9.37.44 AM

TRINETHRAM NEWS

Trinethram News : మంచిర్యాల జిల్లా: ఫిబ్రవరి 04
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న శాంతి లత కు జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేఐసి స్వేచ్ఛాంద సంస్థ ప్రకటించిన విద్యారత్న అవార్డును మంచిర్యాల జిల్లా సీనియర్ అడ్వకేట్ KV, ప్రతాప్ ఆదివారం అందజేసి సాలువతో ఆమెను ఘనంగా సన్మానించారు..

మంచిర్యాల జిల్లా కేంద్రం లోని నస్పూర్ కాలనీ నరసయ్య భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జేసీఐ 3వ ఇన్ఫోలేషన్ శిరోమణి సెమినార్ ను జెసిఐ చైర్మన్ అరుముళ్ల రాజు. ఆధ్వర్యంలో నూతన జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్ నాయకత్వంలో సెమినార్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ జోన్ ప్రెసిడెంట్ గోవింద్, డాక్టర్ వెంకటేష్ పాలాకుల, విపి ఆయుష్, కంపటి అనిల్ కుమార్, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా,విచ్చేసిన మంచిర్యాల జిల్లా ఎంప్లా యిమెంట్ ఆఫీసర్ కౌశిక వెంకట్ రమణ,హాజరై ఆయన ప్రసంగించారు.

విద్యారత్న అవార్డుకు ఎంపికైన శాంతిలతను ఆమె బంధువులు స్నేహితులు, తోటి ఉపాధ్యాయులు, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు..

You cannot copy content of this page