ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళ 20 25
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐ టి ఐ) లో ఫిబ్రవరి 10న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించబడుతున్నది. ఈ మేళాలో ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ మరియు సర్టిఫికెట్ల జిరాక్స్ ఎంఆర్పించి ప్రముఖ గుర్తింపు పొందిన కంపెనీలో అప్రెంటిస్ అవకాశాలు పొందవచ్చు.
అప్రెంటిస్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ ఆక్ట్ ప్రకారం స్టయిఫండ్ (నిరుద్యోగ భృతి) ఉంటుంది. ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఇది చక్కటి అవకాశం.
ఈ అప్రెంటిస్ మేళాలో ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తప్పకుండా పాల్గొనాలని ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ప్రిన్సిపాల్ శ్రీ వీరమల్లి రాధాకృష్ణ గారు ఒక ప్రకటనలు తెలిపారు మరిన్ని వివరాల కోసం చరవాణి 91 266 38 39 నెంబర్ కు సంప్రదించాలని ఆయన తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App