జూలై 23, 2026

WhatsApp Image 2023 12 17 at 6.26.57 PM

TRINETHRAM NEWS

Hyderabad: రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

హైదరాబాద్‌: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు..

ఈ నెల 18న సాయంత్రం 6:25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారం నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించనున్నారు. ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్‌కు సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్‌ నిర్వహించారు. సైబరాబాద్‌ సీపీ ఏకే మహంతి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు..

రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్‌, ఇంటిలిజెన్స్‌ సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్‌, బొల్లారం జంక్షన్‌, నేవీ జంక్షన్‌, యాప్రాల్‌ రోడ్‌, బైసన్‌ గేట్‌, లోతుకుంట జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు..

You cannot copy content of this page