TRINETHRAM NEWS

అధిష్టానం ఆశీర్వదించి ఆదేశిస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో YSRCP అభ్యర్థిగా పోటీకి సిద్ధం
“మాకం జాన్ పాల్ ZPTC”

గత 50 యేండ్లుగా రాజకీయ నేపథ్యం కలిగిన స్థానికుడు, నియోజకవర్గంలోని నాయకులందరితోనూ అనుకూలంగా ఉంటూ..
స్థానిక మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు ఆశీర్వాదంతో ప్రస్తుతం త్రిపురాంతకం జడ్పిటిసిగా మరియు YCP SC సెల్ విభాగంలో ప్రకాశం, బాపట్ల, పల్నాడు మూడు జిల్లాల కోఆర్డినేటర్ గా కొనసాగుతున్న మాకం జాన్ పాల్ గారు, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మన నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయడానికి స్థానిక YSRCP నాయకులు, కార్యకర్తలు మరియు YCP అభిమానులు అవకాశం కల్పించాలని కోరారు.

ZPTC జాన్ పాల్ గారు జిల్లా ప్రజా పరిషత్ సమావేశాల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు
ఉన్నత అధికారుల దృష్టికి మరియు జిల్లా నాయకుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం సాయశక్తులా తన వంతు కృషి చేస్తున్నారు.

ఐదు మండలాల నాయకులకు సుపరిచితుడు, అందరికీ తెలిసిన వ్యక్తి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లోని ప్రతి గ్రామంలో దగ్గర బందు బలగం అత్యధికంగా ఉన్న వ్యక్తి మాకం జాన్ పాల్.

మొదటినుంచి వీరి కుటుంబం
YS రాజశేఖరరెడ్డి కి,
YS జగన్ మోహన్ రెడ్డి గార్కి వీరాభిమానులుగా ఉన్నారు. డా. ఆదిమూలపు సురేష్ కి విధేయుడు. మరియు సన్నిహితుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా ముఖ్య నాయకులతో సత్సంబందాలు కలిగి YCP పార్టీని నమ్ముకుని,
YCP పార్టీ భివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న వ్యక్తి.

విద్యావంతుడు, నమ్మకమైన వ్యక్తి, నిగర్వి అయిన
జాన్ పాల్ కి మంచి పేరు గుర్తింపు ఉన్నాయి.
ఇలాంటి మంచి వ్యక్తికి ఈసారి అధిష్టానం అవకాశం కల్పిస్తే.. జిల్లా ముఖ్య నాయకులు ఆశీర్వదిస్తే.. ఈసారి ఎర్రగొండపాలెం నియోజకవర్గ YSRCP MLA అభ్యర్థిగా తాను పోటీలో నిలబడతానని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నియోజకవర్గ ప్రజల అందరి ఆశీర్వాదం కావాలని వారు కోరుతున్నారు. అధిష్టానం తనకు అవకాశం కల్పించాలని అధిష్టానం మా వైపు దృష్టి సారించాలని జాన్ పాల్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు.