గర్బస్థ లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం డి.ఎం. అండ్ హెచ్. ఓ. డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ
పెద్దపల్లి, నవంబర్ -28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గర్బస్థ లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ అన్నారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్దారణ చట్టం–1994 పరిధి జిల్లా అడ్వైజరి కమిటి సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సంధర్బంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ మాట్లాడుతూ, మన పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 28 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్, జిల్లాలో జరిగే ప్రతి స్కానింగ్ కు సంబంధించి ఫారం ఎఫ్ రూపొందించి ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో జరిగే ప్రసవాలలో వెయ్యి మంది మగ పిల్లలకు 31 మంది ఆడ పిల్లలు జన్మిస్తున్నారని, గర్బస్థ శిశువుగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, పది వేలు జరిమాన విధించబడు తుందని,అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
లింగ నిర్ధారణ అరికట్టుటకు ప్రతి నెల స్కానింగ్ సెంటర్లను కార్యాలయ సిబ్బంది బృందంతో తనిఖీ నిర్వస్తున్నామని అన్నారు. గత మూడు నెలలుగా జిల్లాలోని 18 స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి 67 ఫారం ఎఫ్ లను ఆడిట్ చేశామని అన్నారు.
జిల్లాలోని ఆసుపత్రులలో జరుగుతున్న అబార్షన్ కేసులను సైతం స్టడీ చేసి ఎక్కడైనా లింగ నిర్ధారణ కారణంగా అబార్షన్ జరిగిందో పరిశీలిస్తామని డి.ఎం.హెచ్.ఓ అన్నారు. అధికంగా అబార్షన్ జరిగే ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, డ్రగ్ ఇన్స్పెక్టర్ తో సమన్వయం చేసుకుంటూ అబార్షన్ మాత్రల అమ్మకాలపై పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో పాల్గొన్న ఐ.ఆర్.సి.ఎస్. జిల్లా కన్వీనర్ కావేటి రాజగోపాల్ మాట్లాడుతూ, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులకు లింగ నిర్ధారణ చేయకుండా ఉండే విధంగా చట్టం పై పూర్తి అవగాహాన కల్పించాలని కోరారు. లింగ నిష్పత్తి సమానమయ్యే దిశగా కృషి చేయాలని, ఏ కమ్యూనిటీలో అధికంగా అబార్షన్లు జరుగుతున్నాయో స్టడీ చేసి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని, ఏ స్కానింగ్ కేంద్రంలో అధికంగా స్కానింగ్ లు అవుతున్నాయో పరిశీలించి ఆకస్మిక తనిఖీలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా అడ్వైజరీ కమిటిలో 2 నూతన స్కానింగ్ సెంటర్ల రిజిష్ట్రేషన్ లను , 3 స్కానింగ్ కేంద్రాల రెన్యూవల్ కు సిఫారస్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లాస్ మహిళా సమైక్య అధ్యక్షురాలు సరస్వతి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవీందర్, డిప్యూటి డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ శ్రీరాములు, డెమో వెంకటేశ్వర్లు, పిఓఎంహెచ్ఎన్ డాక్టర్ బి. వాణిశ్రీ, సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App