Praja Darbar : ఎంపీ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రజా దర్బార్

TRINETHRAM NEWS
Praja Darbar organized

Praja Darbar : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 16; జిల్లా కేంద్రమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాబై ఐదు వ డివిజన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మేరా, గ్రంథాలయ చైర్మన్ ఎం ఎస్ బేగ్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు.

వారిరువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గర నుండి నే రుగా సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ లాంటి కార్యక్రమాలను విజయవాడ పార్లమెంట్ లో అమలు చేస్తున్న ఎంపీ చిన్నికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు.

సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక అధికారులు చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రజాదర్బార్ లాంటి కార్యక్రమం ప్రతి డివిజన్ లో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది అని తెలిపారు. నాయకులు స్థానిక అధికారులు ఒకే చోట ఉండడంతో ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అవ్వడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

స్థానికంగా ఉన్న ప్రజలు పెన్షన్లు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు రేషన్ కార్డులు ఇలా అనేక సమస్యలతో రావడం జరిగిందని త్వరలోనే ప్రభుత్వం పెన్షన్ల పైన తీసుకొచ్చే కొత్త పాలసీ పైన వారికి సమాచారం ఇచ్చి అన్ని విధాల వారికి భరోసా ఇచ్చి ఈ వివరాలన్నీ కూడా కొత్త పెన్షన్ ల లో వచ్చే విధంగా చూస్తామని వాళ్లకి భరోసా కల్పించారు జీవో నెంబర్ ముప్పై ద్వారా ప్రజానీకానికి గొప్ప శుభవార్త ఎంపీ చిన్ని తెలిపారని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నూర్ భాషా, కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, గ్రంథాలయా చైర్మన్ ఎంఎస్ బేగ్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు, జిల్లా అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణరావు ,క్లస్టర్ ఇంచార్జ్ ధనేకుల సుబ్బారావు డివిజన్ అధ్యక్షుడు జహీద్, నాయకులు రేష్మ వడ్డాది రవి, మల్లీశ్వరి ,పార్వతి ,ఎర్రంశెట్టి పద్మ , టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు చైతన్య మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాధవ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అన్సర్ ,తెలుగు మహిళా అధ్యక్షురాలు నసీమా, నాయకులు దుర్గ శాంతి బుజ్జి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top