Police Martyrs’ Day : పోలీస్అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిపారు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు వికారాబాద్ మున్సిపల్ కేంద్రంలోని సెయింట్ జూడ్స్ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పోలీసుల అమరవీరుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. అమరులైన పోలీస్ స్థూపం గల చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపాల్ ఉషారాణి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ ఉషారాణి పోలీసు అమరవీరులకు వందనాలు తెలుపుతూ కొన్ని విషయాలు పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. అసాంఘిక కార్యకాలపై ఉక్కు పాదం మోపుతూ శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర అని ఆమె విద్యార్థులకు తెలియజేశారు. ప్రజలకు రక్షణ కల్పించే క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి సేవలను స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ ఉత్సవం జరుపుకుంటున్నామన్నారు.
ఆ త్యాగం మరవలేము భారత చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో 1959 అక్టోబర్ 21న చైనా సైనికుల దాడిలో పదిమంది పోలీస్ జవాన్లు నేలకొరిగారన్నారు. వారి మృతి దేహాలను సొంత ప్రాంతాలకు తరలించలేని పరిస్థితి. దీంతో అక్కడే ఖననం చేశారన్నారు. వారి త్యాగాలకు గుర్తుగా అప్పటినుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుందన్నారు.
శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసుల పాత్ర ప్రధానం దేశ సరిహద్దులు, దేశ ప్రజల ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ పాత్ర ప్రధానమైందని ఉషారాణి విద్యార్థులకు తెలిపారు. దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తించుకోవాలని చెప్పారు. దేశ సరిహద్దులు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందికి జోహార్లు తెలియజేశారు.
పోలీస్ అంటేనే బాధ్యత పోలీసు ఉద్యోగం అంటే బాధ్యతతో కూడుకున్నదని ఉషారాణి విద్యార్థులకు వివరించారు. ప్రజల ధన మాన ప్రాణాల రక్షణలో భాగంగా కొన్నిసార్లు అసాంఘిక శక్తుల చేతుల్లో వీరమరణం పొందక తప్పదు అన్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకె ఈ అమరుల సంస్మరణ దినోత్సవం అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Police Martyrs' Day celebrated

You cannot copy content of this page

Scroll to Top