
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS-2023 అమలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని లోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రామగుండంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షలు జరిగే సమయంలో సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పరీక్షా కేంద్రాలకు పేపరు వచ్చేటప్పుడు, పరీక్ష అనంతరం జవాబు పత్రాలు తీసుకొని వెళ్లేటప్పుడు తప్పకుండా ఎస్కార్ట్ ఉండాలని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు
ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లు ఇంద్రసేన రెడ్డి, రవీందర్ లు, రామగుండం సీఐ ఓ
ప్రవీణ్ కుమార్, రామగుండం ఎస్ఐ సంధ్య రాణి, సిసి హరీష్, సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
