TRINETHRAM NEWS

MILAN- 2024 సందర్భంగా తేదీ 22.02.2024 నాడు విశాఖపట్నం నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్ లో Naval Coastal Battery నుండి Park హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ విన్యాసములు జరుగుతున్న సందర్భంగా సదరు కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ భారత ఉప రాష్ట్రపతి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మరికొంతమంది వివిధ దేశాల ప్రతినిధులు మన విశాఖపట్నం నగరానికి విచ్చేయు చున్నారు. అలాగే 20.02.2024 నాడు MILAN-24 సందర్భంగా Full dress rehearsals నిర్వహించబడును. కావున ఆరెండు రోజులు (20.02.2024 & 22.02.2024) మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 8 గంటల వరకు సదరు నౌకాదళ విన్యాసాలు వీక్షించవచ్చును. సాధారణ వాహనదారులు మరియు పాసెస్ కలిగిన వాహనదారులు, బీచ్ రోడ్ కి ఆనుకొనివున్న రెసిడెంట్స్ వారికి ఈ దిగువ తెలుపబడిన సూచనలు పాటించవలసినదిగా పోలీస్ వారు విజ్ఞప్తి చేయడమైనది.

CUTOFFS/DIVERSIONS:

కలెక్టరేట్ జంక్షన్ నుండి Naval Coastal Battery వరకు, CR Reddy circle నుండి All India Radio జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు మరియు All India Radio జంక్షన్ నుండి పాండురంగాపురం డౌన్ వరకు, నావెల్ క్యాంటీన్ జంక్షన్ నుండి Naval Coastal Battery వరకు, పంది మెట్ట జంక్షన్ నుండి Novotel హోటల్ వరకు, సెంచరీ క్లబ్ నుండి Novotel hotel వరకు, Park hotel junction నుండి NTR beach road లోనికి Passes లేని వాహనములు అనుమతించబడవు. కావున ప్రజలు పోలీసు వారికి సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాత్రమే ప్రయాణించవలసిందిగా కోరడమైనది.

NAVAL PASSES కలిగిన వాహనదారులు

APIIC Ground Naval Vehicle passes కలిగిన వాహనదారులు CR Reddy, All India Radio junction మీదుగా వారికి కేటాయించిన APIIC గ్రౌండ్ నందు park చేసుకొనవలేను తర్వాత విశ్వప్రియ ఫంక్షన్ హాల్ మీదుగా కాలినడకన బీచ్ రోడ్ లోకి తమకు కేటాయించిన enclosures లోనికి వెళ్ళవలెను. AU Foot ball ground Naval passes కలిగిన వాహనదారులు CR Reddy circle, AU Out gate మీదుగా AU Food ball ground నందు Park చేసుకోవలెను. తర్వాత కాలినడకన AU English Medium School Road OR Park Hotel మీదుగా బీచ్ రోడ్ లోకి తమకు కేటాయించిన enclosures లోనికి వెళ్ళవలెను.

GENERAL VEHICLES (సాధారణ వాహనదారులు/పాసులు లేని వాహనదారులు)

  1. RUSHIKONDA, MVP, కురుపాం circle నుండి బీచ్ రోడ్డు గుండా ప్రయాణించు సాధారణ వాహనదారులు మరియు సిరిపురం నుండి బీచ్ వైపు వచ్చే సాధారణ వాహనదారులు Park హోటల్ పక్కనగల MGM గ్రౌండ్ లో తమ వాహనములు పార్క్ చేసి, MGM Ground steps మీదుగా లేదా YMCA దగ్గరలో గల All Abilities Park entrance ద్వారా Steps దిగి/మీదుగా Sand beach లోకి ప్రవేశించి బీచ్ లోన ఉన్న enclosures లోనికి కాలినడకన వెళ్ళవలెను. పార్క్ హోటల్ నుండి ఎటువంటి వాహనాలను బీచ్ రోడ్డులోకి అనుమతించబడవు.
    2.ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ జంక్షన్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, KGH వైపు నుండి వచ్చు సాధారణ వాహనదారులు కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో గల జిల్లా పరిషత్ ప్రాంగణంలో గాని లేదా ఆంధ్ర మెడికల్ కాలేజ్ గ్రౌండ్ నందు గాని లేదా జూబ్లీ గ్రౌండ్ (Only two wheelers) నందు పార్క్ చేసుకొని కాలినడకన Naval Coastal Battery జంక్షన్ మీదుగా గోకుల్ పార్క్ ద్వారా Sand beach లోనికి ప్రవేశించి బీచ్ లో ఉన్న enclosures లోనికి నడచి వెళ్ళవలెను. Naval Coastal Battery or Novotel నుండి Rk Beach లోనికి ఎవరినీ అనుమంతిచబడదు.

RESIDENCE HOLDERS

Naval coastal బ్యాటరీ నుండి Park హోటల్ వరకు బీచ్ రోడ్డులో నివసిస్తున్న వారు పోలీస్ వారికి సహకరించి ఈ కార్యక్రమమును దిగ్విజయం చేయవలసిందిగా కోరడమైనది. అత్యవసరమైనట్లయితే వారి యొక్క ఆధార్ కార్డును చూపించి వేరే ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గం లేనట్లయితే వారికి సందర్భాన్ని బట్టి అనుమతించబడును.

AMBULENCES/EMERGENCY VEHICLES

RUSHIKONDA, MVP, కురుపాం circle నుండి బీచ్ రోడ్డు గుండా ప్రయాణించు అంబులెన్స్ లు పార్కు హోటల్ నుండి డైవర్షన్ తీసుకొని చిన్న వాల్తేరు మీదుగా సిరిపురం చేరుకొని సంబంధిత హాస్పిటల్ కి వెళ్ళవలెను.

VIP ESCORTS

RUSHIKONDA, MVP, కురుపాం circle నుండి బీచ్ రోడ్డు గుండా ప్రయాణించు VIP Escorts పార్కు హోటల్ నుండి డైవర్షన్ తీసుకొని చిన్న వాల్తేరు మీదుగా సిరిపురం చేరుకొని సంబంధిత places కి వెళ్ళవలెను.

REHARSALS (17.202024 to 19.02.2024)

MILAN-2024 యొక్క ప్రాక్టీస్ పరేడ్ సందర్భంగా తేదీ 17.2.2024 నుండి 19.2.2024 వరకు బీచ్ రోడ్డులో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు సముద్రం వైపు ఉన్న సగం రోడ్డు నేవీ పరేడ్ కు కేటాయించడమైనది. ఈ రోజులలో బీచ్ రోడ్డుకు రావాలను కునేవారు సాయంత్రం 6 గంటల తదుపరి రావలసిందిగా సూచించడం అయినది.

ప్రజలు పై సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించి మన విశాఖ నగరంలో జరుగుతున్న ఈకార్యక్రమoను జయప్రదం చేయవలసిందిగా పోలీసు వారి విన్నపములు.