జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండి మైసమ్మ చౌరస్తాలో కుకుడ ఆంజనేయులు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “యూరో కిడ్స్” ప్లే స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, నర్సాపూర్ శాసన సభ్యులు సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్లే స్కూల్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పిల్లలు ఇష్టంగా విద్యను అభ్యసించడంలో, విద్యాబోధనను ప్రారంభించడంలో ప్లే స్కూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఫిలాసఫీలో డాక్టరేట్ పొందిన యురో కిడ్స్ చైర్మన్ కుకుడా ఆంజనేయులు ని ఎమ్మెల్యే గార్లు సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, సాయి యాదవ్, మహేందర్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు కోల్తూరి మల్లేష్, ట్రప్స సభ్యులు రామేశ్వర్ రెడ్డి, వెంకటేష్, ఆంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, వినోద్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Play schools are very useful in helping children

You cannot copy content of this page