Pilaram Maipal Reddy : ఫోన్ టాపింగ్ దోషులను వెంటనే శిక్షించాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. రాజ్యాంగం కల్పించిన నా హక్కును నాకు తెలియకుండానే కాలా రాస్తున్న వారి పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పిటిసి ఫోరం మాజీ అధ్యక్షుడు పీలారం పట్లోళ్ల మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఫోన్ టాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పిటిసి ఫోరం మాజీ అధ్యక్షుడు పీలారం పట్లోళ్ల మహిపాల్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం సీట్ విచారణ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా మైపాల్ రెడ్డితో ఎవరెవరుమాట్లాడుతున్నారనే సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తెప్పించుకున్నట్లుగా ఫోన్ టాపింగ్ కేసు విచారణలో గుర్తించిన సిట్ విచారణ చేసిన అనంతరం మైపాల్ రెడ్డి తన నివాసం లో సిట్ విచారణ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉండడాన్ని చూసి టిఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోను టాపింగ్ చేసిందని అన్నారు. ఈ విషయాన్ని అప్పటి ఎమ్మెల్సీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా తనకు తెలియజేశారని వివరించారు అదేవిధంగా విఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నాయకులకు కూడా తమ ఫోన్ టాపింగ్ చేశారని వివరించడం జరిగిందని తాను ఎవరెవరితో మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అనే ఫోన్ నెంబర్లతో సహా సీట్ అధికారులు అడిగినట్లుగా తెలియజేశారు . ఎవరికీ తెలియని తన పోన్ నంబరు ను కూడా టాపింగ్ చేశారని అన్నారు. ఇలా చేయడం సరి కాదని అన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులను కొందరు రాజకీయ నాయకులు అధికారులు ఇలా చేస్తున్నారని ఇలాంటి వారిపై ప్రభుత్వం వెంబడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top