Awareness of Trade Licenses : పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ ముఖ్యం

TRINETHRAM NEWS

గౌతమి నగర్ వ్యాపారస్తులకు ట్రేడ్ లైసెన్సులపై అవగాహన

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక తో పాటు నమస్తే డే( నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ డే) పురస్కరించుకొని పారిశుధ్య సిబ్బందితో రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది తమ శరీరాన్ని పూర్తిగా కప్పే విధంగా దుస్తులు, పాద రక్షలు , రేడియం జాకెట్, టోపీ ధరించాలని అన్నారు. సాధ్యమైనంత వరకు యంత్రాల సహకారంతో పని చేయాలని అన్నారు. సఫాయి మిత్ర లకు ప్రభుత్వం ఆయుష్మాన్ హెల్త్ కార్డులను అందజేస్తూ మరో రూ.5.00 లక్షలు అదనపు భీమా కవరేజ్ కల్పిస్తున్నదని అన్నారు. సఫాయి మిత్ర కుటుంబ సభ్యులకు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

ఆయుష్మాన్ పథకం వర్తించడానికి సరైన డాక్యుమెంట్ లతో ముందుగా నమోదు చేసుకోవలసిన అవసరం ఉన్నందున నగర పాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని అన్నారు. కాగా అంతకుముందు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో చేపట్టిన వివిధ పనులను ఆయన పర్యవేక్షించారు. గౌతమి నగర్ లో వ్యాపారస్తులకు ట్రేడ్ లైసెన్స్ పై అవగాహన కల్పించారు. గౌతమి నగర్ కంపోస్ట్ యార్డ్ వద్ద కొనసాగుతున్న వాల్ ఆర్ట్ పరిశీలించారు. ద్వారకా నగర్ లో స్లమ్ సమాఖ్య సమావేశంలో పాల్గొని తడి చెత్త పొడి చెత్త, రీ సైకిలింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సప్తగిరి కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే పాటశాల విద్యార్థులకు స్వచ్చతపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. రామగుండం హౌజింగ్ బోర్డ్ కాలనీలో పిచ్చి చెట్లు , పొదలు తొలగించారు.ఈ కార్యక్రమాల్లో నగర పాలక సంస్థ సానిటరీ ఇన్స్పెక్టర్లు కుమారస్వామి, కిరణ్ , నాగ భూషణం , ఆర్ ఐ శంకర్ రావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్ ,ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Personal protection is important

You cannot copy content of this page

Scroll to Top