జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 28 at 12.28.50

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో 30 లక్షల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ లోని పెద్ద చెరువు కట్ట మీద చేపడుతున్న నూతన రోడ్డు పనులను మరియు గ్రేవీ యార్డు పనులను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , పీసరి బాలమని కృష్ణారెడ్డి నాయకులు సురేందర్ రెడ్డి, దర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఆకుల యాదయ్య, మల్లారెడ్డి, మన్నె బాలరాజ్, సత్యనారాయణ ముదిరాజ్ మరియు గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page