జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 18 at 16.07.36

TRINETHRAM NEWS

Trinethram News : బ్రహ్మరధం పడుతున్న బొల్లాపల్లి

బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు, పమిడిపాడు, గరికపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలికారు.

గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం లో ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. మన ప్రభుత్వం లో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ, కుల, మత, పార్టీ ల తారతమ్యాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలిపారు. అలాగే వినుకొండ ను అనేక రకాలుగా అభివృద్ధి చేసి, రానున్న కాలంలో కూడా మరింత అభివృద్ధి ని చేసేందుకు ప్రజలు సహాకరించాలని కోరారు. ఈ నెల 22 వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థి గా నేను నామినేషన్ దాఖలు చేస్తున్నానని, ఆ కార్యక్రమం లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అలాగే మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న తరుణంలో మీరందరూ ఫ్యాన్ గుర్తు పై ఎమ్మెల్యే గా నాకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు వేసి గెలిపించాలని కోరారు…

You cannot copy content of this page