జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 06 at 12.34.24

TRINETHRAM NEWS

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి.

ధర్మపురి మున్సిపల్ కార్యలయం వద్ద ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో

ధర్మపురి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్రంలో పేదవారు ఎంత మంది ఉన్నారు,ఎంత మందికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి,ఇంకా ఎంత మందికి అందాల్సి ఉంది అన్న తదితర విషయాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించడం జరుగుతుందని,అట్టి సర్వే
ఈరోజు నుండి ప్రారంభం అవ్వడం జరుగుతుందని,ఇట్టి సర్వేలో ఒక కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించడం జరుగుతుందనీ,దాని వల్ల ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందనీ,అధికారులు కూడా ప్రజలనుండి కచ్చితమైన వివరాలను సేకరించాలని,ప్రజలు కూడా అధికారులకు సహకరించి వివరాలు వారికి ఇవ్వాల్సి ఉంటుందనీ ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page