TRINETHRAM NEWS

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 3 వ తేదీ సోమవారం పీజీఆర్ఎస్ రద్దు

  • కలెక్టర్ పీ. ప్రశాంతి

Trinethram News : రాజమహేంద్రవరం : ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్‌లకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ జేశారు.

కావున మార్చి 3 వ తేదీ సోమవారం పిజిఆర్ఎస్ నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను మీకోసం పోర్టల్ నందు మీ సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా అర్జీలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు అమలులో ఉంటుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collector P. Tranquility