మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు.
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భారతదేశం ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధిరేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..
ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ అంచలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా రెండు పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారని అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ పివి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా నియమించి దేశ ఆర్థిక చరిత్రని మలుపు తిప్పే ఎన్నో సంస్కరణాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ అంచలంచలుగా ఎదిగి ఆర్బిఐ గవర్నర్ గా విధులు నిర్వర్తించి ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, అనంతరం 1998 నుండి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నుండి 2004 నుండి 2014 వరకు ప్రధానిగా పనిచేసి దేశానికి చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. నిరాడంబరుడిగా సౌమ్యరుడిగా దేశ రాజకీయాలో, ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు.
చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలోని బంగారు సంపదను ఇతర దేశాలకు తాకట్టు పెట్టారని, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టాక పీవీ నరసింహారావు సారధ్యంలో తిరిగి వాటిని దేశానికి తీసుకువచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా పటిష్టపరిచారని విజయరమణ రావు పేర్కొన్నారు. ఆయన మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతున్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సాయిరి మహేందర్, అబ్బయ్య గౌడ్ , చిలుక సతీష్, నరసింహ రెడ్డి, సంతోష్ రావు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App