జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 26 at 22.17.55

TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కమ్యూనిటీ హల్ లో ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలో మంథని అర్ డీ ఓ కార్యాలయ పరిపాలన అధికారి తూమ్ రవీందర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.అసోసియేట్ అధ్యక్షునిగా అలివెని, ఉపాధ్యక్షులుగా కుమార్, సాజిద్ అలీ, అంజలి, కార్యదర్శిగా బ్రాహ్మేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్, మధు , అనుషా, కోశాధికారిగా కరుణాకర్, నిర్వహణ, ప్రచార, కార్యాలయ, సంస్కృతిక, క్రీడల కార్యదర్శులుగా సురేష్, శ్రీకాంత్, శంకర్, తిరుమల్, మధుబాబు, సభ్యులుగా గంగా ప్రణవ్, సతీష్, రాఘవేంద్ర చారి, సిందురి లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా శ్రీరామ్ రెడ్డి, సహాయ అధికారిగా రామారావులు వ్యవహరించారు.
హక్కుల సాధనకు కృషి
రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్
ఉద్యోగుల హక్కుల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని టి జీ వో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సంఘం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్రంలోని సుమారు పది లక్షల మంది ప్రభుత్వ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారన్నారు. అందరి ప్రయోజనాల కోసమే తాము శాయ శక్తుల కృషి చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా సంఘం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయం అన్నారు. రెండో సారి అధ్యక్షునిగా ఎన్నికైన రవీందర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు శ్యామ్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, విష్ణు, బొంకూరి శంకర్, రమేష్, సమర్ సేన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page