Pawan Kalyan : విభజనలో బాధ్యతగా వ్యవహరించలేదు

TRINETHRAM NEWS
Pawan Kalyan Did not act responsibly

Pawan Kalyan : గుంటూరు జిల్లా : మార్చి 28: (త్రినేత్రం న్యూస్); అసెంబ్లీలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజనలో ఆ పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని అన్నారు.
రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా ఇంకా రాజధాని కోసం పోరాడటం బాధాకరమని పేర్కొన్నారు. తనకు తెలంగాణ, ఆంధ్ర అనే విభేద భావనలేదని , తెలుగు నేల అనే ఐక్యత భావన ఉందని చెప్పారు.

ఏపీ పై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top