MLA Jare : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో పాల్గొన్న

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. దమ్మపేట మండలం పట్వారిగూడెం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంకంపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల గండుగులపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. నులిపురుగుల నివారణకు మందులు విద్యార్థులకు, ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో పోషకాహార లోపం రక్తహీనత ఎదుగుదల సమస్యలు వస్తాయని ఈ సమస్యలు నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్రలు, లేదా సిరప్ ఇవ్వబడుతుందని చెప్పారు.

ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు సిరప్ రూపంలో ఐదు సంవత్సరాల పైబడిన వారికి మాత్రల రూపంలో ఇస్తారని వివరించారు. ఈ మాత్రలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అశ్రద్ధ వహించకూడదన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, బూట్లు ధరించడం వంటి అలవాట్లతో నులిపురుగులు రాకుండా తమని తాము కాపాడుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలోమాజీ మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్, దమ్మపేట మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ వాసం రాణి, ఎంఈఓ కీసరి లక్ష్మీ, అంగన్వాడీ సిబ్బంది, మూడు పాఠశాలల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Deworming Day

You cannot copy content of this page

Scroll to Top