జూలై 16, 2026
TRINETHRAM NEWS

ఐ కృష్ణ ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జులై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సారత్రిక సమ్మె విజయవంతo కై ఈ రోజు ఆర్జీ 1 డివిజన్ పరిధిలోని ఏరియా వర్క్ షాప్ లో ద్వారా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ , ఏ ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు జి రాములు హెచ్ ఎం ఎస్ రీజియన్ నాయకులు డాక్టర్ రాయలింగ్.లు మాట్లాడుతూ …కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడలుగా కుదించి కార్మికులను కట్టు బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడుల రద్దుకై జూలై 9న జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఈ నరేష్,మాతంగి రాయమల్లు, ఐ రాజేశం, ఎస్ ప్రసాద్,ఎం రామస్వామి, విజేందర్ రెడ్డి కనుకయ్య , రాయపోషం తదితరులు పాల్గొన్నరు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Participate in the strike

You cannot copy content of this page