పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. సర్పంచ్ ఎన్నికల్లో ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఊళ్ళల్లో పట్టు బిగించేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధినేతలు కార్యకర్తలకు సూచనలు ఇస్తున్నారు.
అధికార పార్టీ నాయకులు మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు డి అంటే డి అనే విధంగా ప్రచారం చేసే విధంగా జోరు కనబడుతుంది. ఏ క్రమంలోనైనా స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావాహులు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్ వస్తుందా లేదా డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకు వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు యువతను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలిపే విధంగా కార్యకర్తలకు సూచనలు మొదలైనాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App