Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్…
వచ్చే నెలలో(మార్చి – 2024) జరగనున్న కోటప్పకొండ తిరునాళ్ళకు పోలీస్ అధికారులు సన్నద్ధంగా వుండాలని ఆదేశించిన ఎస్పీ, తిరునాళ్ళకు సంబంధించి వివిధ ఏర్పాట్ల( *వాహన రాకపోకలు, వాహనాల పార్కింగ్, భక్తుల కోసం క్యూ లైన్ల ఏర్పాటు, ప్రభలు నిలుపు ప్రదేశాలు ఎంపిక మొ”నవి) కొరకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలి పోలీస్ అధికారులకు ఆదేశించిన ఎస్పీ గత సంవత్సరం తిరునాళ్ళ సమయంలో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య తలెత్తితే, దానికి కారణం తెలుసుకుని ఈ సంవత్సరం మరల ఆ విధమైన సమస్య ఉత్పన్నమవకుండా చూడాలని సూచించారు, రోడ్లు మరియు భవనాల శాఖ వారి సమన్వయంతో ఎక్కడైనా రోడ్లు వెడల్పు చేయించడం, రోడ్డు మార్గాలలో అవాంతరాలు వుంటే తొలగించడం, చిన్న చిన్న బ్రిడ్జిలు మరియు కల్వర్టులను బాగు చేయించడం మొదలగు పనులు చేయించాలని సూచించారు, ఆలయ అధికారులతో మాట్లాడి కొండ పైన ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గుడి చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని సూచించారు, ప్రభలు నిలుపు ప్రదేశాలు పరిశీలించి, ప్రభలు వచ్చినప్పుడు ఎటువంటి అవాంతరాలు ఎదురవకుండా, ఎక్కడా యెటువంటి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవకుండా ఉండేందుకు తగిన చర్యలు తెసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (ఏఆర్) రామచంద్ర రాజు, నరసరావుపేట డిఎస్పీ వి ఎస్ ఎన్ వర్మ , ఎస్బి సీఐలు ప్రభాకర్, బలనాగిరెడ్డి లు, నరసరావుపేట రూరల్ సీఐ మల్లికార్జున రావు మరియు ఎస్సై రోశయ్య , ఇతర అధికారులు పాల్గొన్నారు.