Rajineni Venkateswara Rao : బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

TRINETHRAM NEWS

రాజినేని వెంకటేశ్వరరావు . డిండి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు.

డిండి (గుండ్ల పల్లి)ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. ఈనెల 27వ తేదీన (ఆదివారం) బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను డిండి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రాజి నేని వెంకటేశ్వరరావు కోరారు. శుక్రవారం రోజు ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఈ నెల 27న ఆదివారం నిర్వహించే బి ఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభకు కార్యకర్తలు ప్రజలు నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు వనరులను దోచుకుంటూ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ పదేళ్ల పాలనలో సంక్షేమం , అభివృద్ధిలో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభకు డిండి మండలం నుండి పార్టీ శ్రేణులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Party Silver Jubilee

You cannot copy content of this page

Scroll to Top