
Paddy Auction : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 17, త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రంలో 2025 -26 యాసంగి సీజన్ లో పండించిన కే ఎన్ ఎం 1638 రకం నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించారు.
ఈ వేలం పాట లో 8 మంది వ్యాపారులు పాల్గొన్నారు. ఫైనల్ ధర రూ 2450 వచ్చినది. ఈ వేలంపాటలో వరి ధాన్యాన్ని దక్కించుకున్నవారు శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్(రైస్ మిల్) దేవరకొండ. ఈకార్యక్రమంలో నల్గొండ జిల్లా నుండి పాల్గొన్న అధికారులు ఏ డి ఏ గిరి ప్రసాద్, మరియు రమణ, ఏఎంసి దేవర కొండ , మార్కెట్ యార్డు శ్రీకాంత్ (సూపర్ వైజర్), టి ఎస్ ఎస్ డిసి మిర్యాలగూడ-శేఖర్, సీనియర్ అసిస్టెంట్ మురళీమోహన్, ఏ డి ఏ – టి వాసు, ఏవోలు , కే రామలింగేశ్వర రావు, ఎస్ వెంకన్న , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe