Salman Khan : సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. టెర్రరిస్ట్ అని ప్రకటించిన పాక్

TRINETHRAM NEWS

Trinethram News : బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. సల్మాన్‌ను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ‘జాయ్ ఫోరమ్ 2025’ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ కార్యక్రమంలో పాకిస్థాన్‌ను, బలూచిస్థాన్‌ను సల్మాన్ వేరు చేసి మాట్లాడడమే ఆ దేశ ఆగ్రహానికి కారణం.
ఆ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ.. ‘సౌదీ అరేబియాలో హిందీ సినిమాలు సూపర్‌హిట్ అవుతున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక్కడ పాకిస్థాన్ నుంచి, ఆఫ్గానిస్థాన్ నుంచి, బలూచిస్థాన్ నుంచి కూడా వ‌చ్చిన వారు చాలా మంది ఉన్నారు’ అని సల్మాన్ అన్నాడు. పాకిస్థాన్, బలూచిస్థాన్‌లను వేర్వేరుగా ప్రస్తావించడంతో పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. స‌ల్మాన్ వ్యాఖ్యలను దేశ వ్యతిరేక చ‌ర్య‌గా పరిగణించిన పాక్ ప్రభుత్వం అతడు ఒక ఉగ్రవాది అని ముద్ర వేసింది.

పాకిస్థాన్‌ ఉగ్రవాద నిరోధక చట్టం, 1997లోని 4వ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Outrage over Salman Khan's comments

You cannot copy content of this page

Scroll to Top