TRINETHRAM NEWS

5వ తరగతి గురుకులాలలో ఫిబ్రవరి 1వ తేదీ ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు ఫిబ్రవరి 1వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.2025-26 సంవత్సర 5వ తరగతి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు గాను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు 100 రూపాయలు చెల్లించాలని కలెక్టర్ తెలిపారు.

మీ సేవలో దరఖాస్తు చేసుకునేందుకు సాధ్యం కానీ ఎడల స్థానికంగా ఉండే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో కులము, ఆదాయము, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నంబర్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App