జిల్లా వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం
Trinethram News : శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జవవరి 1వ తేదికి సంబంధించిన పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1వ తేది సెలవు దినం కావడంతో డిసెంబర్ 31న (మంగళవారం) పెన్షన్లు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 3,13,255 మంది లబ్ధిదారులకు రూ.128.56 కోట్లు అధికారులు ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు నగదు పంపిణీకి సిబ్బందితో కలిసి క్షేత్రా స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App