11వ రోజు మేమంతా సిద్దం బస్సుయాత్రలో సీఎం జగన్.. పెన్షన్‎పై అవ్వాతాతలతో ముఖాముఖి

TRINETHRAM NEWS

వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర 11వ రోజుకు చేరింది. వెంకటాచలం పల్లి నుంచి బయలుదేరిన బస్సుయాత్ర వినుకొండ మీదుగా గంటావారిపల్లెకు చేరుకోనుంది. వెంకటాచలంపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ బోదనంపాడు, కురిచేడు, చింతల చెరువు, పొదిలి జంక్షన్, చీకటిగల పాలెం మీదుగా వినుకొండకు చేరుకుంది. దారిపొడవునా జగన్‎కు ప్రజలు స్వాగతం పలికారు.

మేమంతా సిద్దం బస్సు యాత్ర 11వ రోజు పెన్షన్ పై అవ్వ,తాతలతో ముఖా ముఖి నిర్వహించారు. ఎప్రిల్ 1న వాలంటీర్లు నేరుగా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించారు. రూ. 200 ఇచ్చే పెన్షన్ ను రూ. 3000 పెంచిన ఘనత మీ బిడ్డ ప్రభుత్వానిదే అని జగన్ వివరించారు.

You cannot copy content of this page

Scroll to Top