
హైదరాబాద్‌లోను సరి, బేసి విధానం..?
ట్రాఫిక్ జామ్‌తో హైదరాబాద్ నగరవాసులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
కమిషనరేట్ పరిధిలో 240కి.మీ. మేర రహదారులు ఉండగా 84లక్షల వాహనాలు తిరుగుతున్నాయి.
అంటే ప్రతి కిలోమీటరుకు సగటున 35వేల వాహనాలు ఉన్నాయన్న మాట.
తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టటానికి సరి,బేసి సంఖ్య విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పారు.
