ఎన్ టి పి సి కాంట్రాక్ట్ కార్మికుల కు సదుపాయాలు కల్పించాలి
ఢిల్లీలో హెచ్ఆర్ డైరెక్టర్ కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సదుపాయాలు కల్పిస్తూ రామగుండం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఢిల్లీలో హెచ్ఆర్ డైరెక్టర్ కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఎన్టిపిసి ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వయోపరిమితి 60 సంవత్సరాల పేరిట అనేక మందిని తొలగిస్తున్నారని ఇందులో ఫిట్నెస్ ఉన్న కార్మికులకు 65 సంవత్సరాల పాటు కొనసాగించాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఈ మేరకు ఆదివారం రోజున ఎన్టిపిసి కార్పొరేట్ సెంటర్ కార్యాలయం ఢిల్లీలో హెచ్ఆర్ డైరెక్టర్ జాడ్లీ ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కలసి వినతిపత్రం అందజేశామని అన్నారు
,ఎన్టిపిసి ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వయోపరిమితి 60 సంవత్సరాల పేరిట అనేక మందిని తొలగిస్తున్నారని ఇందులో ఫిట్నెస్ ఉన్న కార్మికులకు 65 సంవత్సరాల పాటు కొనసాగించాలని కోరారు
కాంట్రాక్ట్ కార్మికులకు సరియైన వైద్య సౌకర్యాలు అందడం లేదని స్థానికంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కార్మిక కుటుంబాలకు వైద్య సదుపాయం అందించాలని ఆయన కోరారు
అదేవిధంగా కార్మికుల పిల్లల చదువుల కోసం కార్పొరేట్ తరహాలో ఇంగ్లీష్ మీడియం స్కూలు ఏర్పాటు చేయాలని, కార్మికుల పిల్లలతో పాటు స్థానిక యువత క్రీడాకారులకు అన్ని సదుపాయాలతో కలిగి ఉన్న స్టేడియంలో నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు
ఎన్ టి పి సి పరిధిలోని టి జి ట్రాన్స్కో కు చెందిన హై టెన్షన్ విద్యుత్ లైన్లను తొలగించాలని రాజీవ్ రహదారి మెయిన్ రోడ్ లో గల సర్వీస్ రోడ్లను రామగుండం తాసిల్దార్ కార్యాలయం వరకు సౌకర్యం కలిగించే విధంగా పొడిగించాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ టి పి సి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మైనార్టీ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసిఫ్ పాషా పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App