NCP party : ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయం ప్రారంభం

TRINETHRAM NEWS

North Telangana central office of NCP party inaugurated

గోదావరిఖని పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు.

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు , రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో జరిగిన

ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతిముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం రామగుండం నియోజకవర్గమని, ఉత్తర తెలంగాణ కు రామగుండం గుండెకాయ వంటిదని, అందుకే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలో ప్రారంభించడం జరిగిందని, రాబోవు కాలంలో ఎన్సీపీ పార్టీని గ్రామగ్రామాన, వాడ వాడకు విస్తరిస్తామని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ‌ఎన్సీపీ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ” అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ కు, జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర లకు, సంకె రాజేష్, కవ్వంపల్లి స్వామిలకు పూల మాలలు వేసి, శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ నాయకులు చెన్నూరి నాగరాజు, సయ్యద్ ముజాహిద్, గొల్లపల్లి రాజు, కోట శ్రీనివాస్, పొన్నం‌ రజిత, మేకల రాజేశ్వరి, అర్కుటి పద్మ, నూన్ కనకలక్ష్మి, గుంటి జయలతో పాటు మహిళలు, ఎన్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

North Telangana central office of NCP party inaugurated

You cannot copy content of this page

Scroll to Top