Goliwada Prasanna Kumar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో గోలివాడ ప్రసన్న కుమార్ చేరిక.

TRINETHRAM NEWS

Goliwada Prasanna Kumar joins Nationalist Congress Party (NCP)

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గ మాజీ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్, కాంగ్రెస్ సేవాదళ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర, హైదరాబాద్ లోని ఎన్సీపీ పార్టీ కార్యాలయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ సమక్షంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ జాదవ్ గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్రకు ఎన్సీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ ” గోలివాడ ప్రసన్న కుమార్ లాంటి నాయకుడు ఎన్సీపీ పార్టీ లో చేరడం పార్టీకి స్థానికంగా బలం చేకూరుతుందని, ప్రజా సేవ చేయాలని ఆలోచన‌ కల్గిన యువ నాయకులకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందని, పార్టీలో చేరే నాయకులకు సముచిత లభిస్తుందని, ఎన్సీపీ పార్టీ ని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసి, రాష్ట్రంలోని ఇతర పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేస్తామని ” అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Goliwada Prasanna Kumar joins Nationalist Congress Party (NCP)

You cannot copy content of this page

Scroll to Top