WhatsApp Image 2024 08 09 at 17.28.52
On the occasion of “Indian Youth Congress“(IYC) 64 Foundation Day
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు
“ఇండియన్ యూత్ కాంగ్రెస్”(IYC) 64 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా
రామగుండం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ నాజీముద్దిన్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
యువజన కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ అధ్వర్యంలో స్థానిక రీగల్ షూ మార్ట్ సర్కిల్ వద్ద ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిలుగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మరియు ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి హాజరై యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి అనంతరం కేకే కట్ చేసి ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ యువజన విభాగం కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక అని, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు వారికి చేరేలా సహకరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు, వివిధ శాఖల అధ్యక్షులు, నాయకులు, కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్ల అధ్యక్షులు, డివిజన్ కమిటీ నాయకులు, వివిధ డివిజన్ల సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
