ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 11 19 at 23.29.37 1

TRINETHRAM NEWS

బీసీ రాజ్యాధికారం లో సంచార ముస్లింల భాగస్వామ్యం ఉండాలి

Trinethram News : ఖమ్మం జిల్లా లో జరిగిన బీసీ కమిషన్ బహిరంగ విచారణ లో సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జమీల్ మరియు మస్తాన్ గారడి సంచార ముస్లిం ల స్థితిగతులు తెలపడం జరిగింది
బీసీ ఈ లకు రాబోవు పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలి
ఎస్సీ ఎస్టీలకు కేటాయించినట్లు బీసీ ఈ లోని 14 తెగలకు ప్రత్యేకం గా గుర్తించి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు అప్పుడే మాకు రిజర్వేషన్ లు అందుతాయని అన్నారు
బీసీ రాజ్యాధికారం లో సంచార ముస్లిం ల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని అప్పుడే నిజమైన బీసీ రాజ్యాధికారం ఆశయం నెరవేరుతుంది అని తెలిపారు
విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో రాణించేందుకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలి
బీసీ ఈ లోని అర్హులకు అవకాశాలు అందకుండా కొందరు అనర్హులు పలుకుబడి కలిగిన వారు కొల్లగొడుతున్నారు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి
మా ఆర్థిక స్థితిగతులు మారాలంటే ప్రత్యేక కార్పోరేషన్ ప్రకటించి ఏటా బడ్జెట్ కేటాయించాలి
ప్రత్యేకంగా గుర్తించి సంచార ముస్లిం లకు వంద శాతం సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
బీసీ ఈ లో మొఘల్,పఠాన్, ఖాన్ లాంటి ఉన్నత వర్గాలకు చేర్చకూడదు
అలాంటి ఆలోచన రిజర్వేషన్ల ఉద్దేశమే మారిపోతుంది ఇలా కొన్ని సలహాలు సూచనలు డిమాండ్లను బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మరియు కమిటీ సభ్యులకు తెలపడమైనది
చైర్మన్ మరియు కమీషన్ సభ్యులకు సంచార ముస్లిం ల గారడి విద్యలు ప్రదర్శించడం జరిగింది
అంతరిస్తున్న మా వృత్తులు ప్రత్యక్షం గా తిలకించడం జరిగింది, మా వృత్తులు ఆంతరించడం కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మా యువత కు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూయించాలని కోరడమైనది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు
జామీల్
రాష్ట్ర ఉపాధ్యక్షులు

మస్తాన్ గారడి
రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఎండి వజీర్
ఖమ్మం జిల్లా అద్యక్షులు

బుడెన్ ఖాన్
ఖమ్మం జిల్లా సెక్రటరీ

ముహమ్మద్ గౌస్
ఖమ్మం యూత్ ప్రెసిడెంటు

ఎండి సాధిక్
వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం
మరియు సభ్యులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page