జూలై 7, 2026

WhatsApp Image 2024 11 19 at 7.12.54 PM

TRINETHRAM NEWS

పెట్ బషీరాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సమావేశం.

ఈ సమావేశంలో రానున్న డిసెంబర్ 3వ తేదీన ఉదయం 11 గంటలకు గండి మైసమ్మ లోని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లాకు చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో వారు జిలా పార్టీ కార్యాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుండి పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా విభాగం నాయకురాళ్లు-సభ్యులు, యువజన విభాగం నాయకులు-సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు-సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page