Vimukthi : ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ నవంబర్ 23 ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సామాజిక తెలంగాణ సాంస్కృతిక సమైక్య సంస్థ అధ్యక్షుడు విముక్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలపర్చడంలో తెలంగాణ ప్రభుత్వం కాక తల్లిదండ్రులూ బాధ్యత వహించాలని.. ప్రభుత్వ ఆధునీకరణ చర్యలతో కంప్యూటర్ విద్య డిజిటల్ తరగతులు
ప్రయోగాత్మక బోధన వంటి పథకాలు తీసుకువస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపడం వల్ల ప్రభుత్వ పాఠశాలల శక్తి క్షీణిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ వనరులు అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు చివరకు తమ పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్లకే పంపడం విచారకరం ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థకు తీవ్రమైన నష్టం ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని విద్య వ్యవస్థలో మార్పులు తేవాలని డిమాండ్ చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

No private schools, government schools are welcome

You cannot copy content of this page

Scroll to Top