జూలై 16, 2026

WhatsApp Image 2024 12 06 at 17.02.52

TRINETHRAM NEWS

డిసెంబర్ 7న గర్రెపల్లి పి.హెచ్.సి లో నిక్షయ్ శిబిరం ప్రారంభం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి

పెద్దపల్లి, డిసెంబర్ -06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

డిసెంబర్ 7న గర్రెపల్లి పి.హెచ్.సి లో నిక్షయ్ శిబిరం ప్రారంభిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిక్షయ్ శిబిరం కార్యక్రమం 100 రోజుల పాటు జరుగుతుందని, టీబి పట్ల అవగాహాన కార్యక్రమాలను నిర్వహించి, హాని కలిగే అవకాశం గల ప్రజలకు పరీక్షలు నిర్వహించి క్షయ వ్యాధి కేసులను నిర్ధారిస్తామని, పోషకాహారం సహాయంతో వివిధ రకాల సేవలు అమలు చేస్తూ క్షయ వ్యాది గ్రస్తుల మరణాలను తగ్గించడం, క్షయ వ్యాది గ్రస్తుల కుటుంబీకులకు, హెచ్.ఐ.వి కలవారికి, హాని కలిగే సమూహాం లోని ప్రజలకు ముందస్తు టి.బి. చికిత్స అందించి క్షయ వ్యాదిని నివారించేందుకు నిక్షయ్ శిబిరం కార్యక్రమం దృష్టి సారిస్తుందని అన్నారు.

టి.బి. వ్యాధికి కేవలం దగ్గు ఒక్కటే లక్షణం కాదని ,
తెమడతో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడడం, చాతీలో నొప్పి, జ్వరం ,బరువు తగ్గడం, ఏదైనా శరీర బాగంలో గుల్లలు (వాపు రావడం) ,రాత్రిపూట చెమటలు, అలసట / నీరసం, గతంలో ఏదైనా ఆరోగ్య సమస్యలు, శారీరక ఆరోగ్యంలో ఆకస్మిక మార్పు వంటి పలు లక్షణాలు ఉంటాయని తెలిపారు.

ఇదివరకు టి.బి. సోకి తగ్గిన వారు, క్షయ వ్యాది సోకిన వారి కుటుంబ సభ్యులు ,పోషకాహార లోపం గలవారు ,మధు మేహాం గల వారు ,హెచ్.ఐ.వి సోకిన వారు, 60 సంవత్సరాల పైబడిన వయస్సు గల వారు క్షయ వ్యాధి సోకేందుకు హై రిస్క్ గ్రూపులుగా గుర్తిస్తామని తెలిపారు. నిక్షయ శిబిరంలో హై రిస్క్ సమూహాలను 100 శాతం ఎక్స్-రే, నాట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.

జిల్లాలో హెచ్. ఐ.వి., అసాంక్రామిక వ్యాదులు, పొగాకు అలవాటు మాను వారు, క్యాన్సర్ మరియు మధు మేహాం, లాంటి వారికి పరీక్షించే ప్రత్యేకమైన అవుట్ పెషెంట్ లకు వంద శాతం టి.బి. పరీక్షలు నిర్వహిస్తామని, గ్రామాల వారిగా తిరుగుతూ టి.బి. లక్షణాలు గల వారికి తెమడ పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైన వారికి ఎక్స్-రే ద్వారా టి.బి. వ్యాదిని నిర్దారించి మందులు పంపిణీ చేస్తామని, ప్రతి సామాజిక ఆరోగ్యకేంద్రాలలో, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రిలలో , మెడికల్ కళాశాలలో ఒ.పి.లో 10 శాతం టి.బి. పరీక్షలు నిర్వహించబడును , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒ.పి.డి. లో 5 శాతం టి.బి. పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమములో టి.బి. చాంపియన్స్, స్వచ్చంద సంస్థలు మరియు నిక్షయ్ మిత్రలు పాల్గోనడం జరుగుతుందని,ఈ కార్యక్రమములో వివిధ శాఖల అధికారులు, ప్రజలు బాగసౌమ్యులై టి.బి. రహిత జిల్లాను చేయుటకు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆ ప్రకటనలో కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page